తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అక్షయ పాత్ర లాంటిదే. ఎంతమంది హీరోలు వచ్చినా... ఇంకా చోటు ఉన్నట్లు  తాజా మరో చిత్ర వారసుడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. రాజకీయాల్లోనూ, చిత్ర పరిశ్రమల్లో వారసుల హవా ఎక్కువగానే ఉంటుంది. అదీ చిత్ర పరిశ్రమలో అయితే మరీ ఎక్కువనే చెప్పుకోవాలి. నానమ్మ దర్శకత్వం, నాన్న హీరో వారసత్వాన్ని అంది పుచ్చుకుని వెండితెరపై సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. విజయనిర్మల తనయుడు, అలనాటి హీరో నరేష్ కుమారుడు నవీన్ కథానాయకుడుగా కనిపించనున్నాడు. నవీన్ ఇప్పటికే దర్శకత్వ శాఖపై మక్కువతో చిన్న చిన్న ప్రయోగాలు కూడా చేశాడు. అయితే త్వరలో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫ్రెండ్లీ మూవీస్ బ్యాన‌ర్‌పై చంటి అడ్డాల నిర్మించే ఈ చిత్రానికి క్రియేటివ్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ వద్ద అసోసియేట్‌ ద‌ర్శ‌కుడిగా పని చేసిన రామ్‌ప్ర‌సాద్ దర్శకత్వం వహించనున్నాడు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాతో నవీన్ సిక్స్‌ప్యాక్‌ బాడీతో అలరించనున్నాడు.  అవునులే వడ్డించేవాడు మనోడు అయితే ఓ బంతిలో కూర్చుంటే ఏంటన్నట్టు.... సపోర్టు ఉంటే ఎవరైనా హీరోగా తెరకెక్కవచ్చు.

 

 

Tags: Sr Naresh son, Naveen Telugu hero, Vijaya Naresh son, Naveen

0 comments Blogger 0 Facebook

 
ManaTelanaganaWorld.com © 2013. All Rights Reserved.
Top