ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై ఓ భూవివాదం కేసులో ఛార్జ్ షీట్ దాఖలైంది. ఆయన చెన్నై నీలాంగరై సమీపంలో కొంత స్థలాన్ని కబ్జా చేసినట్లు ఫిర్యాదుతో పోలీసులు ఈ ఛార్జ్ సీటు నమోదు చేశారు. అంతకు ముందు ఈ కేసుకు సంబంధించి మణిశర్మకు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. ఇక వివరాల్లోకి వెళితే మణిశర్మకు నీలాంగరై సమీపంలోని కానత్తూర్‌లో కొంత స్థలం ఉంది. ఆయన తన స్థలం పక్కనున్న 73 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆ స్థలం యజమాని సేలంకుప్పన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నకిలీ పత్రాలతో దాదాపు 10 కోట్ల విలువ చేసే భూమిని మణిశర్మ కబ్జా చేసినట్లు ఆరోపణ. దాంతో పోలీసులు మణిశర్మపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే మణిశర్మ మేనేజర్ రఘరామన్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసు ఇంటరాగేషన్ కోసం మణిశర్మను త్వరలో పిలిపించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మణిశర్మపై గత నెల జూన్ 27న కోర్టులో చార్జిషీటును దాఖలు చేసినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరి మణిశర్మ భూకబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలు వాస్తవమా, కాదా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Tags: Manisharma land issue, Telugu Music Director manisharma land issue, manisharma land, manisharma chargesheet

0 comments Blogger 0 Facebook