దశాబ్దం పైగా దక్షిణాదిని ఓ ఊపు ఊపేసిన చెన్నై చిన్నది త్రిష తాను నటించిన
పాత్రాల విషయంలో ఇప్పటికీ సంతృప్తి పొందలేదట. సుదీర్ఘ కాలం తర్వాత వెనక్కి
తిరిగి చూసుకుంటే తనకు గొప్పతనాన్ని ఆపాదించిన మంచి పాత్రలేమీ లేవని ఆమె
తీరాగ్గా వాపోతోంది. అందుకే ఇకనుంచి అయినా ప్రేక్షకులకు గుర్తుండే
పాత్రల్లో నటించాలని డిసైడ్ చేసుకుందట. అలాంటి కథా పాత్రలను ఎంపిక
చేసుకోవాలని నిర్ణయించుకున్నానని త్రిష చెప్పుకొస్తొంది. ఇకపై హీరోలతో
కలిసి చెట్లు, పార్క్ ల వెంట తిరుగుతు ప్రేమ గీతాలు పాడటంతో పాటు ప్రేమించు
అంటూ హీరో వెంట పడటం చేయదట. అంతే కాకుండా సినిమా చివర్లో గ్రూప్ ఫోటోకు
ఫోజులిచ్చే పాత్రలకు కూడా నో అంటుందట.
వర్షం సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయిన త్రిష
....కొత్త నీరు వచ్చి పాతనీరు పోయినట్లు కొత్త హీరోయిన్ల రాకతో ఇండస్ట్రీలో
వెనుకబడిన మాట వాస్తవమే. అయితే, బాలకృష్ణ సరసన తాజాగా ఓ సినిమాకి ఎంపిక
కావడంతో త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. కాగా త్రిష చాలా
కాలం తర్వాత తెలుగు తెరపై మెరవనుంది. హీరో బాలకృష్ణ తాజా చిత్రంలో ఆమె
నటిస్తోంది. రుద్రపతి రమణరావు నిర్మాతగా భారా బడ్జెట్ తో యువ దర్శకుడు
సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'గాడ్సే' పేరు ఖరారు చేసినట్లు
సమాచారం. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ...పదేళ్లే తర్వాత
త్రిషకు జ్ఞానోదయం అయిందా అనే గుసగుసులు వినిపిస్తున్నాయి.
గతాన్నెవరూ మరిచిపోకూడదంటారు. ఒక్కో విషయంలో అయితే గతం గతః అనాల్సి ఉంటుంది. ఈ రెండు కాకుండా, నటి త్రిష మాత్రం గతం ఘనంగా ఉండాలని ఆశిస్తున్నారు. ఇప్పడీమెకు ఇలాంటి భావన ఎందుకు కలిగిందంటారా? అనుభవాలు చెప్పిన పాఠాలేమో. త్రిష అందగత్తె. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె కన్నులు కవ్విస్తాయి. నవ్వులు కుర్రకారు నవనాడుల్ని జివ్వుమనిపిస్తాయి. దశాబ్దంపైగా దక్షిణాది సినీ ప్రియులను అలరిస్తున్న త్రిష నటిగా ఇప్పటికీ సంతృప్తి పొందలేదు. ఇది ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది.
Tags: Trisha, Trisha telugu news, Trisha telugu movies, latest telugu movies, new telugu movies, telugu political news , telugu cinema news, telugu latest gossips, latest telugu gossips, telugu video news.

0 comments Blogger 0 Facebook