
'బాహుబలి' ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి సారధ్యంలో యంగ్ హీరో ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ
చిత్రం నిర్మాణంలో అనేక సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా
బాహుబలి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా పంపిణీ
హక్కులను నైజాంతోపాటు ఇతర ఏరియాలను అత్యధిక రేటుకు దిల్ రాజు సొంతం
చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. కేవలం నైజాం హక్కుల్ని భారీ స్థాయిలో
సుమారు 25 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఓ సినిమా కోసం అదీ ఒక ప్రాంతపు హక్కుల కోసం తెలుగు సినిమా చరిత్రలో
ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం ఇదే తొలిసారి. బహుబలి హక్కుల్ని అధిక
మొత్తంలో కొట్టేసిన దిల్ రాజు చాలా ఖుషీగా ఉన్నారట. అత్యంత సాంకేతిక
పరిజ్ఞానంతో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కుతున్న బహుబలి చిత్ర విజయంపై
దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారట. ఇందు కోసం జక్కన్న సినిమాను ఓ రేంజ్ లో
చెక్కుతున్నారు. హ్యాట్రిక్ దర్శకుడిగా పేరున్న రాజమౌళి ఈ సినిమాకు
దర్శకుడు కావటం ఓ ఎత్తు అయితే... మరోవైపు ప్రభాస్, రానా, అనుష్క,తమన్నాలు
నటించటం ఈ సినిమాకు మరో క్రేజ్ ఏర్పడింది. వచ్చే ఏడాది విడుదలకు సిద్దం
అవుతున్న బహుబలి రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందో...
Top
0 comments Blogger 0 Facebook