పెళ్లి చేసుకుని, చక్కగా కాపురం చేసుకుంటున్న వాళ్లను కూడా విడగొట్టేసేందుకు తెగ ఉత్సాహపడిపోతుంటారు జనాలు. అదీ ఇక నటీనటులు విషయంలో అయితే అదిగో పులి అంటే, ఇదిగో తోక అన్నట్లు.... పెళ్లి పెటాకులు, త్వరలో విడాకులు అంటూ పుకార్లను జెట్ స్పీడ్ వేగంతో వండి వడ్డించేస్తుంటారు. తాజాగా ఆ ఒక్కటీ అడక్కు..అంటూ వెండితెరకు పరిచయమై కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టి...ఆ తర్వాత నచ్చినవాడిని మనువాడి సినిమాలకు దూరంగా ఉన్న రంభ ప్రస్తుతం అందరికీ హాట్ టాఫిక్ అయ్యింది. నాలుగేళ్ల క్రితం రంభ కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమరన్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరికీ ఓ పాప కూడా. ముద్దులొలికే కూతురు లాస్యతో రంభ కెనడాలో బిజీబిజీగా ఉంది.
అయితే భర్తలో విభేదాలు రావటంతో ప్రేమపెళ్లి మూడేళ్లకే పెటాకులు అయ్యిందని, భర్త నుంచి రంభ విడాకులు తీసుకోనుందని అప్పట్లో కథనాలు వెలువచ్చాయి కూడా. అంతే కాకుండా సెకెండ్ ఇన్సింగ్ ప్రారంభించేందుకు అక్కడ నుంచి చెన్నై మకాం మార్చిందని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ గాలివార్తలు, పుకార్లే నని మరో సీనియర్ నటి కుష్బూ స్టేట్ మెంట్ ఇచ్చారు. రంభ తన భర్తతో కలిసి చక్కగా కాపురం చేసుకుంటోందని ఆమె తెలిపారు. ఇంతకీ రంభ విడాకుల గురించి కుష్పూ ఘాటుగా స్పందించాల్సి వచ్చిందనుకుంటున్నారా. అసలు విషయానికి వస్తే ఇటీవలి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుష్బూ కెనడా వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న రంభ అక్కడ ఆమెను కలిసి తన ఇంటికి ఆహ్వానించింది. వాళ్లింటికి వెళ్లిన కుష్బూ అక్కడ రంభ గారాలపట్టి లాస్యని తెగ ముద్దు చేసిదంట. అంతేకాకుండా తన పతీ సమేతంగా కుష్బూతో కలిసి రంభ నయగర జలపాతాన్ని వీక్షించింది. ఈవిషయాన్ని కుష్బూ తన ట్విట్టర్ లొ పోస్ట్ చేసింది. వారిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారని, అయితే అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆమె తెలిపింది.
Top
0 comments Blogger 0 Facebook