సీనీ పరిశ్రమలో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఏ కథానాయకుడికి ఒక రచయిత కథను సృష్టిస్తాడో.. చివరికది ఏ కథానాయకుడి చేతిలో పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ చేతులు మారే ప్రక్రియలో చివరికి ఆ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవ్వడమో.. లేక చరిత్రలో కలిసిపోయే సినిమా అవ్వడమో మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటిదే ఒక గాసిప్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు తిరుగుతోంది.

 

వెన్నెల, ప్రస్థానం వంటి విభిన్న చిత్రాలతో పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవాకట్టా.  ప్రస్థానం సినిమాలో అతని రచన, దర్శకత్వ ప్రతిభకు ముగ్ధులైన టాలీవుడ్ స్టార్ హీరోలు  అతనితో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్, పవన్‌లు సైతం ఈ జాబితాలో ఉన్నవారే. ఆ నేపథ్యంలోనే దేవాకట్టా తన ఆటోనగర్ సూర్య కథను పవన్‌కు వినిపించారట.. అయితే పవన్ ఈ కథ నచ్చక పక్కన పెట్టారని సమాచారం. చివరికి ఆ సినిమా నాగచైతన్య చేతిలో పడింది. ఈమధ్యే విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఒకవేళ పవన్ గనక ఈ సినిమా చేసుంటే ఫలితం ఎలా ఉండేదనేది ఓ ప్రశ్నే. గబ్బర్ సింగ్ లా రికార్డులు సృష్టించేవాడో...జానీలాంటి ప్లాప్ ను తన ఖాతాలో వేసుకునేవాడో.

0 comments Blogger 0 Facebook

 
ManaTelanaganaWorld.com © 2013. All Rights Reserved.
Top