చమ్మక్ ఛల్లో అంటూ తెలుగులో తెరంగేట్రం చేసిన మళయాళీ బ్యూటీ కేథరీన్ థెరిస్సా చూపు మళ్లీ టాలీవుడ్ పై పడింది. గ్లామర్ ఫీచర్స్ బాగానే ఉన్నా కేథరీన్ నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ మనటంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి. దాంతో కేథరీన్ తట్టాబుట్టా సర్థేసుకుని కోలీవుడ్ కు జంప్ అయిపోయింది. అయితే అక్కడ కూడా ఆమెకు వర్క్ అవుట్ కాలేదు. అవకాశాలు వచ్చినా అన్నీ గ్లామర్ లేని పాత్రలే కావటంతో తనను గుర్తించటం లేదంటూ తెగ ఫీల్ అయిపోయింది. నటనను ఉపయోగించుకోలేకపోయినా...కనీసం తన అందాన్ని అయినా గుర్తించాలని మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది.
దాంతో స్టార్ డమ్ అందుకోవటానిక చేసిన ప్రయత్నాలు వృధాగా మారాయి. దాంతో ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్నట్లు కేథరీన్ మళ్లీ టాలీవుడ్ వైపు కన్నేసింది. ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ లేకపోయినా...కనీసం స్కిన్ షో చేసే పాత్రలు అయినా దొరక్కపోవా అనే ఆశతో ఉంది. అంతే కాకుండా చూపించేందుకు వెనకాడనంటే ఎంతయినా ఇచ్చేందుకు తెలుగు నిర్మాతలు రెడీగా ఉండటంతో అమ్మడు మళ్లీ భాగ్యనగరానికి మకాం మార్చాలని చూస్తుందట. సో మరి కేథరీన్ కి సెకండ్ ఇన్సింగ్స్ లో అయినా ఏమేరకు కలిసి వస్తోందో చూడాలి.

0 comments Blogger 0 Facebook