అప్పట్లో వారిద్దరి మధ్య బంధం బ్రేక్ అయినట్లు వచ్చిన వార్తతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన రానా, త్రిష మళ్లీ కలిసిపోయరట. అంతే కాకుండా వీరిద్దరూ పారిన్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో రానా, త్రిష మధ్య ప్రేమాయణం పెళ్లి వరకూ వెళ్లిందని, అయితే అందుకు హీరోగారి తండ్రి అడ్డు తగిలారని సమాచారం. అయితే ఆ వార్తలను రానాతో పాటు చెన్నై చిన్నది కూడా ఖండించేసింది అప్పట్లో. మీమిద్దరం మంచి స్నేహితులం , కలిసి చదువుకున్నాం అంటూ కధలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఇద్దరు విడిపోయారనే వార్తలు వచ్చాయి. రానా ఇంట్లో వాళ్లు చూసిన పిల్ల మెడలోనే తాళి కడతాడు అంటూ తనయుడి గురించి సురేష్ బాబు చెప్పుకొచ్చారు. దీనితో రానా త్రిషలు బ్రేకప్ అంటూ తెర పడింది.
అయితే తాజాగా ఈ ఫెయిర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాలో జరుగుతున్న తమిళ సంఘాల ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా వెళ్లిన వీరిద్దరూ అక్కడ మళ్లీ జంటగా హల్ చల్ చేస్తున్నారట. అయితే అక్కడ తమని పట్టించుకునేవాళ్లు ఎవరూ లేరనే ధీమాతో రానా,త్రిషలు అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతున్నట్లు కోలీవుడ్ మీడియా కథనాలు. ప్రియుడితో కలిసి త్రిష తెగ ఎంజాయ్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Top
0 comments Blogger 0 Facebook