
సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే అన్నట్లు వర్మ
నాలుగు ఆకులు చదివితే .... ఆయన హీరోయిన్ తేజస్వి ఆరు ఆకులు చదివినట్లుంది.
ఐస్‌క్రీమ్ చిత్రంలో న్యూడ్ గా నటించానని డేర్ గా స్టేట్ మెంట్ ఇచ్చి
టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.... నగ్నంగా నటించానో లేదో సినిమా
చూసిన తర్వాత ప్రేక్షకులే చెబుతారని పజిల్ వదిలింది. ఐస్‌క్రీమ్ సినిమాలో
చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయని....అయితే అవన్ని పక్కన పెట్టేసి కేవలం
న్యూడ్ సీన్ కి ఇంత న్యూసెన్స్ చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. ఈ
సినిమాలో ఓ సన్నివేశంలో కనీసం లో దుస్తులు కూడా లేకుండా నగ్నంగా
నటించిందని సమాచారం. ఈ విషయాన్ని ఆమె ధైర్యంగా బయటకు వెల్లడించటంతో ఈ
సినిమాపై ఎక్కడలేని క్రేజ్ పెరగటంతో పాటు ఆమె ఓవర్‌నైట్ హీరోయిన్
అయిపోయింది.
న్యూడ్ గా నటించానని ప్రెస్ నోట్ లో వెల్లడించిన అనంతరం తనకు చాలా
ఫోన్ కాల్స్ వచ్చాయని తేజస్వి తెలిపింది. దీని గురించి తన కుటుంబ సభ్యులు,
బంధువులు చాలా వర్రీ అయ్యారని చెప్పుకొచ్చింది. అయితే తాను ఆ సీన్ ను
అందరి ముందు చేయలేదని, ఆ గదిలో తాను కేవలం...కెమెరా మాత్రమే ఉన్నట్లు
తెలిపింది. తానూ అందరిలాంటి అమ్మాయినే అని, అంతమంది ముందు అలా ఎలా
చేస్తానని ఎదురు ప్రశ్న వేసింది. కథ రీత్యా ఈ సన్నివేశం సినిమాకు చాలా
ముఖ్యమని దర్శకుడు వర్మ చెప్పటంతో అలా చేస్తే తప్ప ఆ సన్నివేశం పండదని
తనకు అనిపించిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త
అనుభూతిని ఇస్తుందని తెలిపింది. మరి సినిమా చూసాక కానీ అమ్ముడు చెప్పింది
నిజమో...కాదో తెలుస్తుంది. అప్పటివరకూ ఆగాల్సిందే మరి.
Top
0 comments Blogger 0 Facebook