తేజ గురించి కొత్తగా చెప్పనకర్లేదు. ప్రేమ సినిమాలు తెరకెక్కించడంలోనూ దిట. మొదట టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న తరువాత తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలని ఫ్లాప్ అయ్యాయి. కొంతకాలం తర్వాత మళ్ళీ దర్శకత్వం భాధ్యతలు చేపట్టారు. రీసెంట్ గా "1000 అబద్ధాలు" అని ఓ సినిమా తీయగా అది కాస్త అట్టర్ ఫ్లాప్ అవడంతో మరో అబద్ధం ఆదేశాడు. అది అట్టాంటి ఇట్టాంటి అబద్ధం అని కూడా కాకుండా అబద్ధమ్ ఆఫ్ మిలీనియమ్ చెప్పొచ్చు. 


తేజ, కమల్ హాసన్ తో సినిమా తీస్తున్నటూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ఈ వార్త ఈ చెవి ఆ చెవిలో పడుకుంటూ చివరికి కమల్ చెవిన పడింది. ఈ వార్త విన కమల్ వెంటనే స్పందించి నాకు తెలియకుండా నేను తెలుగులో సినిమా చేయడమా అని విస్తుపోయారట. వెంటనే కమల్ తేరుకొని 'నేను తెలుగులో ఏ సినిమా చేయడం లేదు' అని వెంటనే ప్రెస్ నోట్ విడుదల చేశాడు. 'నేను తెలుగులో ఓ సినిమా చేయాలనుకోతున్న మాట నిజమే. ప్రస్తుతం దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నా... కానీ ఇప్పటి వరుకు ఏ దర్శకుడికి కమిట్ ఇవ్వలేదు అని తేల్చేశారు. ఆ సినిమా కూడా నా సొంత బ్యానర్ లో నిర్మిస్తాను అని ఆ ప్రెస్ నోట్ లో వివరించారు.

0 comments Blogger 0 Facebook

 
ManaTelanaganaWorld.com © 2013. All Rights Reserved.
Top