అదిగో ఇదిగో అంటూ..... టాలీవుడ్ మెగాస్టార్ రీఎంట్రీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. కథానాయకుడి  నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.  త్వరలో పుట్టినరోజు సందర్భంగా ఆయన తన 150వ చిత్రం గురించి ప్రకటిస్తారని సమాచారం. మెగాస్టార్ మళ్లీ నటించేందుకు సిద్ధం కావటం ఆయన అభిమానులకు పండుగే అని చెప్పుకొవచ్చు. అంతే కాకుండా చిరుతో ఆయన తనయుడు స్ర్రీన్ పంచుకోవటం అభిమానులకు డబుల్ థమాకానే.  రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో తండ్రితో కలిసి నటించేందుకు తెగ ఉత్సాహపడిపోతున్నాడట. ఈ విషయాన్ని చెర్రీ స్వయంగా ఒక జర్నలిస్ట్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.  ఒకవేళ ఆ సినిమాలో తనకు తగిన పాత్ర లేకపోతే, తన కోసం ఒక పాత్ర సృష్టించమని ఆ చిత్ర రచయితని రిక్వెస్ట్ చేస్తానని చెప్పాడట.

అప్పట్లో తనయుడి కోసం చిరంజీవి 'మగధీర' చిత్రంలో కలిసి బంగారు కోడిపెట్ట అంటూ కలిసి స్టెప్ లు వేసిన విషయం తెలిసిందే. దాంతో మరోసారి తండ్రి,కొడుకులు కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే మెగా అభిమానులకు ఇక కనువిందే. అత్యంత ప్రతాష్టాత్మకంగా నిర్మించదలచుకున్న ఈ సినిమా కోసం ఇప్పటికే మూడు కథలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీటిలో ఏదో ఒక దానిని ఖరారు చేసే అవకాశం ఉంది.  స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌వాళ్లని గడగడలాడించిన రాయలసీమ వీరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా ఒక స్క్రిప్టును బ్రదర్స్ సిద్ధం చేశారు. ఈ స్క్రిప్టును చిరంజీవి ఓకే చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్ట్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.  ఇంతకీ ఆ సినిమా దర్శకుడెవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది.

0 comments Blogger 0 Facebook

 
ManaTelanaganaWorld.com © 2013. All Rights Reserved.
Top