''హంప్టీ శర్మ కీ దుల్హనియా ''చిత్రంలోని వరుణ్ ధావన్ సరసన నటించినది అలియా భట్. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారని వార్తలు బాలీవుడ్ లో చెక్కర్లు కొట్టయి. కానీ వారు మాత్రం మా మధ్య ఏమి లేదు అని కొట్టిపారేశారు. వరుణ్ ధావన్ రీసెంట్ గా ఇంటర్వ్యూ లో తన మనసులోని మాటను బయట పెట్టారు.
నాకు అలియా భట్ లాంటి అందమైన అమ్మాయి పెళ్ళాంగా రావాలని ''హంప్టీ శర్మ కీ దుల్హనియా ''చిత్రంలోని అలియా పోషించిన క్యారెక్టర్ లా ఉండాలని తన మనసులోని కోరికని బయట పెట్టాడు హీరో వరుణ్ ధావన్. మేమిద్దరం మంచి స్నేహితులమని ఎప్పుడు సరదాగా గడుపుతూ చిలిపి తగాదాలు పడుతుంటామని, ప్రేమతో, అసహ్యం తో తరచూ గొడవ పడుతూ పోట్లాడు కుంటామని అన్నాడు.
మా ఇద్దరి మద్య ఏదో కెమిస్ట్రీ జరుగుతోందని వార్తలు వస్తున్నాయని కానీ అదేమీ లేదని మా ఇద్దరి మద్య ఉన్నది కేవలం సినిమా పరమైన కెమిస్ట్రీ మాత్రమేనని, నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదని కానీ పెళ్ళాం మాత్రం అలియా భట్ లాంటి అమ్మాయి కావాలని ఆశ పడుతున్నాడు. మరి మీడియా మాత్రం అలియా భట్ ''లాంటి'' అమ్మాయి అంటే ఎక్కడ ఉంటుంది... అలాంటి అమ్మాయి అంటే అలియా భట్ మాత్రమే ఉంటుంది అని సైటర్స్ వేస్తున్నారు.

0 comments Blogger 0 Facebook