ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలకు అధ్బుతమైన సంగీతాన్ని అందించి, ఇండస్ట్రీలో మంచి పేరున్న సంగీత దర్శకుడు మణిశర్మ. గతకొంతకాలం నుండి ఒకటో రెండో తెలుగు సినిమాలు చేస్తుకుంటు కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు.
 
రీసెంట్ గా మణిశర్మపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసారు. ఒక భూ ఆక్రమణకు సంబంధించిన కేసులో ఇరుక్కున్నారు మణిశర్మ. మణిశర్మకు చెన్నై నీలాంగరై సమీపంలోని కానత్తూర్‌లో తన సొంత భూమి ఉంది. అయితే ఆయన స్థలం పక్కనే ఉన్న మరో స్థలం లోని 73 సెంట్ల స్థలాన్ని మణిశర్మ ఆక్రమించాడని ఆరోపణలు చేస్తూ, ఆ స్థలం యజమాని సేలంకుప్పన్ నీలాంగరై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనితో పోలీసులు క్రైం బ్రాంచ్ కి అప్పగించడంతో క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ స్థలం దగ్గరికి వెళ్ళి పర్శీలించారు. ఈ తనిఖిలలో మణిశర్మ భూ ఆక్రమణకు పాల్పడినట్లు రుజువయింది. ఈ మేరకు ఆయనపై స్థలాక్రమణ కేసును నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మణిశర్మ కోర్టులో ముందస్తు బెయిల్ పొందారని తెలుస్తోంది.

0 comments Blogger 0 Facebook

 
ManaTelanaganaWorld.com © 2013. All Rights Reserved.
Top