జూ. ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పురి జగన్నాధ్న్ కాంబినేషన్ లో
బండ్ల గణేష్ 'పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్' పతాకంపై ఓ భారీ చిత్రం
నిర్మిస్తున్న సంగతిని ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రకటించిన విషయం
తెలిసిందే. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అలియా బట్ ని తీసుకోవాలి
అని అనుకున్న ఎన్టీఆర్, కాజల్ పేరు చెప్పడంతో కాజల్ నటిస్తుంది. అంతకముందు
పురి జగన్నాధ్న్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆంధ్రావాలా' ఫ్లాప్
అవ్వడంతో మళ్ళీ అది రిపీట్ అవకుండా కధ తగిన జాగ్రతలు తీసుకుంటున్నారు
వీరిద్దరు. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ సమాచారం 'నేనో రకం' అనే టైటిల్
ని బండ్ల గణేష్ రిజిస్టర్ చేశారు.
ఈ టైటిల్ లోనే పురి మార్క్ కనపడడంతో సినిమాపై భారీగా
అంచనాలని పెంచేస్తుంది. పురి రీసెంట్ గా 'హార్ట్ ఎట్టక్' తో మంచి విజయాన్ని
అందుకున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం 'రభస' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ
సినిమా పూర్తివగానే 'నేనో రకం' మొదలవుతోంది.

0 comments Blogger 0 Facebook