అయిదుగురు స్నేహితుల ప్రయాణం 'పాఠశాల'
'విలేజ్ లో వినాయకుడు', 'కుదిరితే కప్పు కాఫీ' చిత్రాల తరువాత 'మూన్ వాటర్' పిక్చర్స్ సంస్థ నిర్మించిన మూడవ చిత్రం ' 'పాఠశాల'.
కాలేజ్ ఆఖరి రోజున నాలుగేళ్ళుగా కలసి తిరిగిన స్నేహితులను, కాలేజ్ ని వదలలేక అయిదుగురు స్నేహితులు కలసి ఒకరి ఊరికి ఒకరు వెళ్లాలని అనుకుంటారు. స్నేహితుడి ఇంట్లో గడిపిన ఆ నాలుగురోజులు నాలుగేళ్ళుగా తెలిసిన ఆ స్నేహితు డినే కొత్తగా పరిచయం చేసింది. వాళ్లకి తెలిసిన స్నేహితుల గురించే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు. పదహారేళ్ళ పాటు చదువుకున్న ప్పుడు నేర్చుకోని పాఠాలు ఆ ఒక్క ప్రయాణం లో నేర్చుకున్నారు.
ఆ ఒక ప్రయాణం నేర్పించిన పాఠాలే..ఈ 'పాఠశాల'
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై చివరి వారంలోగానీ, ఆగస్టు మొదటి వారంలో గానీ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
సాయిరోనక్,అనుప్రియ,నందు,శిరీష, హమూద్ మరియు శశాంక్,నరసింహరాజు,కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం తదితరులు నటిస్తున్నారు.
సంగీతం; రాహుల్ రాజ్(ఓ మై ఫ్రెండ్), ఎడిటింగ్: శ్రవణ్.కె.: కెమెరా: సుదీర్ సురెందరన్
నిర్మాతలు: రాకేశ్ మహంకాళి,పవన్ కుమార్ రెడ్డి.
రచన - దర్శకత్వం: మహి.వి.రాఘవ్

0 comments Blogger 0 Facebook